NRML: ముధోల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు రూ.11 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తోందన్నారు. అర్హులకు ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
30 మందికి రూ.11 లక్షల CMRF చెక్కులు


