హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

ASR: డుంబ్రిగుడ శాఖా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిణి సునీత జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. వారోత్సవాల సందర్భంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారిణి సునీత తెలిపారు.