హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవుపల్లిలో గ్రంథాలయ వారోత్సవాలు

VZM: బొండపల్లి మండలం దేవుపల్లి శాఖ గ్రంథాలయంలో 59వ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంధాలయ అధికారి పి నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజులు పాటు విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. విజేతలకు ముగింపు వారోత్సవాల్లో బహుమతులు అందజేస్తామని చెప్పారు. గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగంచేసుకోవాలని కోరారు.