VZM: కొత్తవలస మండల టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కనకాల శివ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి, మంగళగిరి పార్టీ కార్యాలయానికి మెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపించినట్లు ఆయన వెల్లడించారు. తనను 12 సంవత్సరాలు పార్టీలో ఆదరించినందుకు టీడీపీ కుటుంబ సభ్యులకు, పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ ప్రధాన కార్యదర్శి రాజీనామా


