హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా కార్తీక మాసోత్సవాలు

AKP: కోటవురట్ల మండలం రాజుపేటలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజలింగేశ్వరస్వామి ఆలయంలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు కార్తీక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నవంబర్ 20న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, 24న జ్వాలాతోరణం, 30న కార్తీక వనభోజనాలు నిర్వహిస్తారన్నారు. ప్రతిరోజూ ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయన్నారు.