హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈయూలోకి 50 మంది ఆర్టీసీ ఉద్యోగుల చేరిక

గుంటూరు, మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోలకు చెందిన 50 మంది ఎన్‌ఎంయూఏ సభ్యులు ఎంప్లాయీస్ యూనియన్‌లో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు సమక్షంలో చేరికలు జరిగాయి. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతామని ఆయన తెలిపారు. పెరిగిన పనిభారం తగ్గించి, మూసివేసిన నాలుగు డిపోలను డిసెంబర్‌లో పునఃప్రారంభించాలని కోరారు.