ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సోడా నరసింహాచారి స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి వైభవంగా పల్లకిసేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్మీ నరసింహ స్వామికి వైభవంగా పల్లకి సేవ


