AKP: బాలల దినోత్సవం సందర్భంగా మానవత్వం వెల్లివిరిసింది. రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న నాతవరానికి చెందిన షేక్ హుస్సేన్ పదేళ్ల కుమారుడు కుదన్ చికిత్సకు ఎన్‌సీసీ శిక్షణ పొందుతున్న విద్యార్థులు రూ.2,200 అందించారు. అలాగే, నాతవరం పోలీస్ సిబ్బంది రూ.10 వేలు సాయం చేశారు. ఎస్సై వై. తారకేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం ఈ మొత్తాన్ని బాలుడి కుటుంబానికి అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారికి అండగా నిలిచిన చిన్నారులు


