NRPT: మద్దూరు మండలం దమగన్‌పూర్ పీఏసీఎస్ పరిధిలో కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటుకు కలెక్టర్ సీహెచ్. ప్రియాంక ఆమోదం తెలిపినట్లు చైర్మన్ గూళ్ళ నరసింహ తెలిపారు. 2026-27 SMAM పథకం కింద మంజూరైన ఈ కేంద్రం ద్వారా ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు అద్దెకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రైతులకు సాగు ఖర్చులు తగ్గి, వ్యవసాయ పనులు సులభతరం కానున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
కస్టమ్ హైరింగ్ సెంటర్‌కు కలెక్టర్ ఆమోదం


