హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న నల్లమల

NGKL: అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతం అక్టోబర్ మాసంలో ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోంది. పచ్చని అడవులు, చల్లని వాతావరణం, అందమైన వ్యూ పాయింట్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. నల్లమల అటవీ మార్గం గుండా శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. జూన్, అక్టోబర్ నెలలు నల్లమల అందాలను వీక్షించేందుకు అనువైన సమయాలుగా నిలుస్తున్నాయి.