హైదరాబాద్: 28°C
వార్తలు

యూఎస్-రిలయన్స్ కీలక చర్చలు

జామ్‌నగర్(గుజరాత్) పర్యటనలో ముఖేష్, అనంత్ అంబానీలతో US ప్రతినిధులు మార్కో రూబియో, సెర్గియో గోర్‌ కీలక అంశాలపై చర్చించారు. గ్లోబల్ ఎనర్జీతో పాటు సంప్రదాయ, నూతన ఇంధన రంగాల్లో వాణిజ్య భాగస్వామ్యాలపై సమాలోచనలు జరిపారు. అలాగే టెక్నాలజీ, ఎనర్జీ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులు, US కంపెనీలతో కలిసి పనిచేసే అవకాశాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.