హైదరాబాద్: 28°C
వార్తలు

275మంది ఎమ్మెల్యేలు మావైపే: సీఎం

బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తే మొత్తం 294 మందిలో 275మంది ఎమ్మెల్యేలు బీజేపీకే ఓటు వేస్తారని వెల్లడించారు. టీఎంసీ టికెట్‌పై గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేల మద్దతూ కమలం పార్టీకి ఉందని బాంబు పేల్చారు. ప్రజలతో ఎన్నికైన తమది ఓ సనాతన ప్రభుత్వమని చెప్పారు.