హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర ప్రమాదం.. తల్లి, కుమారుడు మృతి

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హజరీబాగ్ జిల్లాలో రోడ్డు దాటుతున్న మహిళ, ఆమె నాలుగేళ్ల కుమారుడిని లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.