హైదరాబాద్: 28°C
వార్తలు

దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలకు పరామర్శ

NDL: గడివేముల (మం) ఓండుట్లలో దసరా జమ్మి పూజకు వెళ్తున్న వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడిలో గాయపడిన నలుగురిని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి బుధవారం సాయంత్రం కర్నూలులోని ఓ ఆసుపత్రిలో పరామర్శించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామని కాటసాని భరోసా ఇచ్చారు.