హైదరాబాద్: 28°C
వార్తలు

రాపూరులో తొలిరోజు నామినేషన్లు నిల్

NLR: జిల్లా రాపూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు మొదటిరోజు నామినేషన్ల దాఖలుపై ఆసక్తి చూపకపోవడంతో నామినేషన్ కేంద్రాలు సందడి లేకుండా కనిపించాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.