హైదరాబాద్: 28°C
వార్తలు

భూ వివాదంలో వ్యక్తి పై దాడి!

KMM: ఏదులాపురంలో మామిళ్ల నరేందర్ రెడ్డి బుధవారం తన ఆవులను పొలానికి తీసుకెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన మామిళ్ల నర్సిరెడ్డి అడ్డగించి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇరువురికి భూ వివాదం ఉన్నట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ రాజు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.