హైదరాబాద్: 28°C
వార్తలు

అయ్యప్ప భక్తులకు అలర్ట్‌

శబరిమలలో ఆన్ లైన్ గదుల బుకింగ్ విధానాల్లో కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు దేవస్థానం బోర్డు సిద్ధమవుతోంది. ఇకపై ముందస్తుగా దర్శనం బుక్ చేసుకున్న భక్తులకే వసతి గదులు కేటాయించేలా మార్పులు చేయాలని నిర్ణయించబోతోంది. దీని ద్వారా గదుల బుకింగ్‌లో ఏజెన్సీలు, దళారుల జోక్యాన్ని అరికట్టవచ్చని భావిస్తోంది. తద్వారా సామాన్య భక్తులకు వసతి గదులు అందుబాటులోకి వస్తాయని యోచిస్తోంది.