హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్‌వి పిల్ల చేష్టలు: బీజేపీ

RSS అనేది కేవలం పురుషులతో కూడిన రాజ్యాంగ వ్యవస్థని అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. RSS గురించి రాహుల్ గాంధీకి అసలు అవగాహనే లేదని చెప్పింది. ఆయన వ్యాఖ్యలు పిల్లచేష్టలను తలపిస్తున్నాయని ఎద్దేవా చేసింది. మహిళ కోసం RSSలో ప్రత్యేక విభాగమే ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు ఆ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొంటారని చెప్పింది.