హైదరాబాద్: 28°C
వార్తలు

టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక

దేశంలోని ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. వార్తల ప్రసారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని తేల్చి చెప్పింది. హింసాత్మక దృశ్యాలను ప్రసారం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, లైంగిక నేరాల బాధితుల గుర్తింపును బయటపెట్టకూడదని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.