హైదరాబాద్: 28°C
వార్తలు

బొద్దింక దహనంపై ఆప్‌ ఆగ్రహం

ఢిల్లీలోని పీతాంపురలో 30 అడుగుల భారీ బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేయడంపై ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది హిందూ మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడింది. వేల ఏళ్ల సనాతన సంప్రదాయాలను అపహస్యం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ ఎల్జీకి, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. నిర్వాహకులు రామ్ లీలా కమిటీతో పాటు బీజేపీ ఎమ్మెల్యే అశోక్, మంత్రి కపిల్ మిశ్రపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.