హైదరాబాద్: 28°C
వార్తలు

నేనేం ట్రావెల్‌ ఏజెంట్‌ను కాదు: శశిథరూర్‌

ఢిల్లీలో నిరసనలు జరుగుతున్న వేళ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు విదేశాలకు వెళ్లారని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను కేరళంలో విలేకర్లు ప్రశ్నించారు. దీనికి వ్యంగ్యంగా సమాధానమిస్తూ.. తానేమి ట్రావెల్ ఏజెంట్‌ను కాదన్నారు. ఆ ప్రశ్న తనను అడిగి ప్రయోజనం లేదని చెప్పారు. ప్రతి వ్యక్తికి కొన్ని బాధ్యతలు ఉంటాయని.. కావున రాహుల్ పర్యటనపై తనేమీ చెప్పలేనని మాట దాటేశారు.