హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాతబస్తీలో వైభవంగా సిక్కుల శోభాయాత్ర

HYD: పాతబస్తీలో సిక్కు సమాజం ఆధ్వర్యంలో దసరా శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. గత వందేళ్లుగా ఈ యాత్ర మతసామరస్యానికి ప్రతీకగా కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు. వేలాది మంది సిక్కు యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన బహదూర్‌పురా SHO హఫీజుద్దీన్, ట్రాఫిక్ SHO బాలకృష్ణలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.