ఢిల్లీలో వాయునాణ్యత సూచీ (AQI) 244కు పడిపోవడంతో తొలిదశ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. GRAP-I కింద అధికారులు.. ధూళి నియంత్రణకు కఠినమైన చర్యలు అమలు చేయనున్నారు. ఇవాళ్టి నుంచి రోడ్లన్నింటినీ మెకానికల్ రోడ్ స్వీపర్ల ద్వారా శుభ్రం చేయనున్నారు. అలాగే హోటళ్లు, రెస్టరంట్లలో బొగ్గు, వంటచెరకు వాడకాన్ని నిషేధించారు. అంతేకాకుండా డీజిల్ జనరేటర్ల వాడకంపై కూడా ఆంక్షలు విధించారు.
వార్తలు
పడిపోయిన వాయునాణ్యత.. ఢిల్లీలో ఆంక్షలు


