హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో అమల్లోకి గ్రాప్ స్టేజ్-1

ఢిల్లీలో గ్రాప్ స్టేజ్-1 అమల్లోకి వచ్చింది. దేశ రాజధానిలో గాలి నాణ్యత పడిపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గాలి నాణ్యత సూచి(ఏక్యూఐ) 200 దాటితే కాలుష్యం కట్టడికి అత్యవసర చర్యల్లో భాగంగా ఈ గ్రాప్ స్టేజ్-1ను అమలు చేస్తారు. దీంతో ఇకపై కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ లేని వారి జరిమానాతో పాటు నో ఫ్యుయల్ పాలసీని అమలు చేస్తారు.