హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి: ఖర్గే

ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన రక్షణ కల్పిస్తూ 2023లో తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన అక్రమాలన్నింటికీ సీఈసీ జ్ఞానేశ్ కుమారే కారణమని ఆరోపించారు. అలాంటి వారికి చట్టపరమైన రక్షణ ఎందుకు కల్పించారని కేంద్రాన్ని ప్రశ్నించారు. తప్పులు చేయిండానికి, ఆ తర్వాత వారిని క్షమించడానికే చట్టంలో రక్షణ కల్పించారా? అని నిలదీశారు.