హైదరాబాద్: 28°C
వార్తలు

‘క్రికెట్ అర్థం కాకుంటే భారత్‌కు మిత్రుడు కాలేరు’

'క్రికెట్‌ను పూర్తిగా అర్థం చేసుకునేంత వరకు మీరు భారత్‌కు నిజమైన మిత్రుడిగా గుర్తింపు పొందలేరు' అంటూ అమెరికా సెక్రటరీ మార్కో రూబియోతో విదేశాంగ మంత్రి జైశంకర్ సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికా జట్టులోని ప్రముఖ క్రికెటర్ సౌరభ్ నేత్రవల్కర్ ముంబై నగరానికి చెందినవారేనని ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన గుర్తుచేశారు. జైశంకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.