హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్త ట్రెండ్.. హెడ్‌ఫోన్స్‌తో నిమజ్జనం!

ముంబైలో(MH) దుర్గా మాత మూర్తుల నిమజ్జనోత్సవంలో సరికొత్త ట్రెండ్ కనిపించింది. లౌడ్ స్పీకర్ల హోరు లేకుండా భక్తులు 'సైలెంట్ డీజే'తో నిమజ్జనంలో సందడి చేశారు. ఇందులో లౌడ్ స్పీకర్లు ఉండవు.. డీజే మ్యూజిక్ వాళ్ల హెడ్‌ఫోన్స్ ద్వారానే వినిపిస్తుంది. చుట్టుపక్కవారికి ఇబ్బంది కలగకుండా భక్తులంతా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఉత్సాహంగా డ్యాన్సులు చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.