హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

AKP: నాతవరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు పోలీసు సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ సెల్యూట్ చేసి గౌరవం ప్రకటించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.