హైదరాబాద్: 28°C
వార్తలు

‘అజిత్ దోవల్ వ్యూహంతోనే పాకిస్థాన్‌లో అస్థిరత’

భారత జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్ వ్యూహాల వల్లే పాకిస్థాన్‌లో అస్థిరత ఏర్పడిందని ఆ దేశ సీనియర్ న్యూక్లియర్ అడ్వైజర్, లెఫ్టినెంట్ జనరల్ మజార్ జమిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' కారణంగానే ఇరు దేశాల మధ్య అణు యుద్ధ భయాలు తలెత్తాయని వెల్లడించారు. దోవల్ మాస్టర్ మైండ్ దెబ్బకు పాక్ తీవ్ర భయాందోళనలకు గురవుతోందని పరోక్షంగా అంగీకరించారు.