హైదరాబాద్: 28°C
వార్తలు

అమితాబ్, అమీర్, సల్మాన్ ఖాన్ ఇళ్లపై రెక్కీ

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెల రోజులుగా నలుగురు నటుల ఇళ్లపై దుండగులు రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో తెలిసింది. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ ఇళ్లపై రెక్కీ చేసినట్లు గుర్తించారు. ఆటో, ట్యాక్సీల్లో తిరుగుతూ ఇళ్ల ఫొటోలు సేకరించారు. జుహులోని అద్దె గదిలో నిందితులు బస చేసినట్లు తెలిపారు.