ELR: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ అమరవీరులకు నివాళులర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన 154 మంది అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసు అమరవీరులకు ఘన నివాళులు


