హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొండా సురేఖ చేతుల మీదుగా రావణాసురుడి దహనం

WGL: వరంగల్ నగరంలోని తోట మైదానం సమీపంలోని కొత్తవాడలో విజయదశమి సందర్భంగా మంగళవారం రావణవధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరై రావణాసురుడి ప్రతిమను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారని అన్నారు.