ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలో పచ్చని అడవులు, జలపాతాలకు, గిరిజన సంస్కృతికి నిలయం. ఇక్కడ పత్తి పంట విస్తారంగా పండటం వల్ల దీనిని 'వైట్ గోల్డ్ సిటీ' అని కూడా పిలుస్తారు. రాష్ట్రంలోనే ఎత్తైన కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతాలు, చారిత్రక జైనథ్ ఆలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. గోండ్లు, కొలాంల వంటి గిరిజనుల సంస్కృతి, గోండు బిడ్డ కొమురం భీం పోరాట పటిమ మన జిల్లా ప్రత్యేకతలు.
తెలంగాణ
మన జిల్లా ప్రత్యేకతలు..!


