హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా దుర్గాభవాని నిమజ్జన వేడుకలు

JGL: కోరుట్ల మండలం పైడిమడుగులో దుర్గాభవాని నిమజ్జన వేడుకలు కన్నులపండువగా జరిగాయి. మంగళవారం నిర్వహించిన ఈ వేడుకల్లో హైదరాబాద్ కళాకారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డోలాయత్రతో అమ్మవారిని గ్రామ వీధుల్లో ఊరేగించి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా డ్యాన్సులతో సందడి చేశారు.