ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూరు(కర్ణాటక) దసరా ఉత్సవాలు ప్రధాన ఘట్టానికి చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన జంబూ సవారీ ఇవాళ అట్టహాసంగా జరగనుంది. ఏనుగులపై సాగే చాముండేశ్వరి అమ్మవారి ఊరేగింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. భక్తుల కోలాహలం నడుమ సాయంత్రం 4 గంటలకు ఈ జంబూ సవారీ అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. దీన్ని వీక్షించేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేసారు.
వార్తలు
మైసూరులో అట్టహాసంగా జంబూ సవారీ


