హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావణుడి దహన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని యతి రాజారావు పార్కులో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని రావణుడి దిష్టిబొమ్మకు నిప్పంటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... రావణ దహనం ద్వారా అధర్మంపై ధర్మం, చెడుపై మంచి ఎప్పటికైనా విజయం సాధిస్తాయనే సందేశాన్ని ప్రజలకు అందిస్తుందని పేర్కొన్నారు.