హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైతులకు తప్పని సాగునీటి కష్టాలు

ఆసిఫాబాద్‌ జిల్లాలో కుమురం భీం ప్రాజెక్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించలేకపోతోంది. పది టీఎంసీల సామర్థ్యంతో రూ.600 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు లక్ష్యం నెరవేరడం లేదు. కుడి కాలువ ద్వారా 6 వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 45,500 ఎకరాలకు నీరందించాల్సి ఉండగా, కాలువల పనులు పూర్తికాక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.