హైదరాబాద్: 28°C
వార్తలు

రెండో రోజు కొనసాగుతున్న మార్కో భారత పర్యటన

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఇవాళ జామ్‌నగర్‌లో(గుజరాత్‌) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా భారత ఇంధన రంగంపై కీలక చర్చల్లో పాల్గొంటారు. అలాగే ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత, వాణిజ్య పెట్టుబడుల వృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ మేరకు మార్కో పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.