KNR: జిల్లాలో విజయదశమి వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి. శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా శమీ పూజ చేసి, ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సాయంత్రం రావణ దహన కార్యక్రమాలు నయనానందకరంగా సాగాయి. జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
ఘనంగా ముగిసిన దసరా వేడుకలు


