MLG: ములుగు మండలం జాకారం గ్రామ పంచాయతీలో విజయదశమి సందర్భంగా మంగళవారం పంచాయతీ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. సర్పంచ్ బొట్ల కార్తీక్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ అనంతరం సిబ్బందిని సన్మానించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ.. అభివృద్ధికి సహకరిస్తున్న కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లాల్ పాషా, బొచ్చు ప్రశాంత్ పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామపంచాయతీ కార్మికులకు దుస్తులు పంపిణీ


