హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడు రోజుల తర్వాత లభ్యమైన మృతదేహం

MLG: వెంకటాపురం శివారులోని బోడిచెరువులో నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. బతుకమ్మ పండుగ చివరి రోజు పూల కోసం చెరువు వద్దకు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. మూడు రోజుల అనంతరం మంగళవారం మృతదేహం నీటిపై తేలడంతో బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికితీయించి కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.