హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డైట్ మైదానంలో ఘనంగా విజయదశమి వేడుకలు

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు, నాయకులు రావణ దహన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన బాణాసంచా కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది.