హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు

JN: చిల్పూర్ మండలం పత్తేపూర్ గ్రామంలో దసరా సందర్భంగా సర్పంచ్ గూగులోతు లక్ష్మి ఉమ్లా నాయక్ గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మంగళవారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని ఆమె కొనియాడారు. పండుగ సందర్భంగా సిబ్బందికి వస్త్రాలు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.