హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవంబర్ 24న లింబాద్రిగుట్ట జాతర

NZB: భీమ్‌గల్ మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్ట శ్రీవారి ఉత్సవాల తేదీలను ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి విడుదల చేశారు. నవంబర్ 15 నుంచి 26 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 15న గ్రామాలయం నుంచి కొండపైకి శ్రీవారి పయనం,19న కళ్యాణం,24న జాతర ఉంటాయని వెల్లడించారు. అలాగే 26న స్వామివారు తిరిగి గ్రామాలయానికి చేరుకుంటారని తెలిపారు.