NRML: కోలూర్లో ఎల్లమ్మ ఆలయానికి భూమిపూజ తానూర్ మండలం కోలూర్ గ్రామంలో ఎల్లమ్మఆలయ నిర్మాణానికి మంగళవారం భూమిపూజ నిర్వహించారు. స్థానిక సర్పంచ్ మాధవరావు ఆలయ స్థలంలో ప్రత్యేక పూజలు చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎల్లమ్మ ఆలయ నిర్మాణం గ్రామ అభివృద్ధికి, భక్తుల ఆధ్యాత్మిక అవసరాలకు ఉపయోగపడుతుందని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎల్లమ్మ ఆలయానికి భూమిపూజ


