హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసంతృప్తి నడమ రావణాసుర దహనం

MHBD: గూడూరు మండల కేంద్రంలో స్థానిక రామ్ లీలా మైదానం వద్ద ఏర్పాటుచేసిన రావణాసుర దహన కార్యక్రమం ఏర్పాట్లలో తప్పిదం జరిగింది. సర్పంచ్ సునీత కొమ్మాలు నాయక్ స్వాగతం కోసం వైభవంగా నిర్వహించిన బాణసంచా పేలుళ్లలో రావణాసుర కటౌట్ పై మెరుగులు పడ్డాయి. దీంతో కార్యక్రమం ప్రారంభంలోనే రావణాసురుడి దహనం కావడంతో నిర్వాహకులతో పాటు, వీక్షకులు అసంతృప్తికి లోనయ్యారు.