హైదరాబాద్: 28°C
వార్తలు

ఎముకలు విరిగేదాకా తెలియని ముప్పు

నొప్పి లేకుండానే ఎముకల పటుత్వం తగ్గించే ఆస్టియోపోరోసిస్‌పై అప్రమత్తంగా ఉండాలని కిమ్స్ ట్రస్ట్ ఎముకల వైద్య నిపుణుడు డాక్టర్ లక్ష్మణ్ సత్తి సూచించారు. చిన్న దెబ్బకే తుంటి, వెన్నుపూస ఎముకలు విరిగే ప్రమాదం ఉందన్నారు. చిన్నతనం నుంచే ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, వ్యాధిని ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవాలని ప్రపంచ ఆస్టియోపోరోసిస్ దినోత్సవం సందర్భంగా తెలిపారు.