హైదరాబాద్: 28°C
వార్తలు

వీధుల్లోకి వచ్చిన యువత నక్సల్స్‌ కాదు: ఉద్ధవ్‌ ఠాక్రే

శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే BJPపై విమర్శలు చేశారు. వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న యువత నక్సలైట్లు కాదని, హక్కుల కోసం పోరాడుతున్న విప్లవకారులని అన్నారు. నిరసన తెలపడం యువత హక్కు అని పేర్కొన్నారు. కొత్త ఓటర్లతో సహా ప్రజల ఓట్లు చోరీ అవుతున్నాయని ఆరోపించారు. సమాజంలో విభేదాలు సృష్టించేందుకు BJP ప్రయత్నిస్తోందని, హిందుత్వాన్ని అపఖ్యాతిపాలు చేస్తోందని విమర్శించారు.