RSS కేవలం మగవారితో కూడిన రాజ్యాంగ వ్యతిరేక సంస్థ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆరోపించారు. మహిళలను పురుషుల ఆస్తిగా భావించే సంకుచిత ధోరణి ఆ సంస్థకు ఉందని మండిపడ్డారు. తాను శివశక్తిని విశ్వసిస్తానని, అందుకే RSSతో పోరాటడంతో ఆనందం కలుగుతుందన్నారు. ఈ పోరాటం సమానత్వం, సూత్రాలకు సంబంధించినదని చెప్పారు. RSS భావజాలంతో సంబంధం ఉన్న మహిళలు సైతం తన పోరాటానికి మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
వార్తలు
RSSపై రాహుల్ తీవ్ర విమర్శలు


