హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా పరిషత్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

ATP: అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలోని జడ్పీటీసీ నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ పి. జగదీష్ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.